తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలను పోషించిన నటుడు అజయ్. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతోన్న '24' చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. ఇటీవల 24 కు సంబంధించిన పోస్టర్స్ ను విడుదల చేశారు. అందులో అజయ్ లుక్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇష్క్ చిత్రంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటించిన తనకు మరోసారి విక్రమ్ కుమార్ అద్భుతమైన పాత్రను ఇచ్చాడని, ఈ పాత్ర తనకు మంచి బ్రేక్ అవుతుందని అజయ్ తెలియజేశారు.
-Press note
No comments :
Write comments