రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై ఆదిత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్ 7'. పూజా జావేరి కథానాయిక. 'ఇష్క్', గుండెజారి గల్లంతయ్యిందే', 'మనం' చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ విభాగాల్లో పనిచేసిన ముకుంద్ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'ఈవర్షం సాక్షిగా' వంటి హిట్ చిత్రాన్ని అందించిన బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ ''లవ్, కామెడీ, హారర్ అంశాలతో ఏడు భిన్న కథలతో రూపొందుతున్న చిత్రమిది. దర్శకుడు ఎంచుకున్న కథ బలమైనది. ఆదిత్‌కు కరెక్ట్‌గా యాప్ట్ అయ్యే కథ ఇది. అతని క్యారెక్టర్ సినిమాకు హైలైట్ అవుతుంది. పూజా నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో భారీ ప్రాంతాల్లో ఓ షెడ్యూల్ పూర్తి చేశాం. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు షూటింగ్ లొకేషన్‌కి వచ్చి 'ఎల్7' టైటిల్ ఆసక్తికరంగా ఉందని చెప్పి, కథ గురించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకోవడం విశేషం. సోమవారం నుంచి వైజాగ్‌లో చేసే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడడంలేద. మా బ్యానర్‌లో మంచి సినిమా అవుతుంది'' అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దుర్గాప్రసాద్, సంగీతం: అరవింద్ శంకర్, ఆర్ట్: నాగసాయి, సమర్పణ: మాస్టర్ ప్రీతమ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్, కో.ప్రొడ్యూసర్: బి.మోహనరావు, సతీష్ కొట్టె.
No comments :
Write comments