కేవలం కంటెంట్ మీద నమ్మకంతో సినిమాలను రూపొందించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో మొదటి వరుసలో పేర్కొనదగిన దర్శకుల్లో గతేడాది డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి విజయం సాధించిన దొంగాట చిత్ర దర్శకుడు వంశీకృష్ణ ఒకరు. దర్శకుడిగా తొలి చిత్రంలోనే ఘన విజయం సాధించిన వంశీకృష్ణను శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ బెస్ట్ డెబ్యూట్ డైరక్టర్ అవార్డు తో సత్కరించనుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ''నన్ను నమ్మి దర్శకుడిగా అవకాశమిచ్చిన లక్ష్మి మంచు గారికి, దొంగాట టీమ్ కు నా ధన్యవాదాలు చెప్తూ తనకు అవార్డును ప్రకటించిన శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ కు కృతజ్ఞతలు'' తెలిపారు.
-Press note
No comments :
Write comments