హైదరాబాద్ :
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవం అంగరంగావైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఈ నెల 15న జరిగే శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా హజరై స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు తెలంగాణ నుంచేకాక ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీశ్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు భక్తులు స్వామివారి కల్యాణం తిలకించేందుకు భద్రాచలం తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు సచివాలయంలో కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిథిలా ప్రాంగణంలో భక్తులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హజరకానున్నారు. అదే రోజు భద్రాద్రి అభివృద్ది భవిష్యత్ ప్రణాళికను సీయం వెల్లడించే అవకాశం ఉంది.దీంతో భద్రాద్రి ఆలయాన్ని అభివృద్ది చేసేందుకు ఎలాంటి ప్రతిపాదనలను సిధ్దం చేయాలనే దానిపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు,ప్రభుత్వ సలహదారు రమణ చారిలు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లతో పాటు శాశ్వాత ప్రాతిపాదికన భ్రద్రాద్రి అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలేంటనే దానిపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు,ప్రభుత్వ సలహాదారు రమణ చారి అధికారులు, ఆలయ పండితులు, స్తపతిలతో చర్చించారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక రాష్ట్రంలో ఉన్న ఆలయాలను వాటి ప్రాశస్త్యాన్ని బట్టి అభివృద్ది చేయాలనే దృడ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. యాదగిరిగుట్ట,వేములవాడ ఆలయాల అభివృద్దికి ఇప్పటికే ప్రణాళిక రూపోందించిన నేపథ్యంలో భద్రాద్రిని కూడా అదే రీతిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్లుతున్నారు. శాశ్వత ప్రాతిపాదికన శీ రామచంద్ర స్వామి ఆలయాభివృద్ది, పర్ణశాల అభివృద్ది పనులు ,భద్రచల పట్టణాభివృద్ది, భద్రచల పట్టణానికి అనుసంధానంగా జాతీయ రహదారుల నిర్మాణంపై ప్రధానంగా చర్చించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణ చారి ,భద్రచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య,ఎమ్మెల్సీ లక్ష్మినారయణ,ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, భద్రచలం ఈవో జ్యోతి,దేవాదాయ శాఖ అధికారులు, ఐటీసీ,సింగరేణి కాలరీస్ ప్రతినిదులు పాల్గోన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి :
ప్రతి యేటా అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కళ్యాణ శోభ ఉట్టిపడేలా మండపాన్ని అధికారులు తీర్చిదిదద్దుతున్నారన్నారు. కళ్యాణ మహోత్సవానికి గవర్నర్ నరసింహన్ , ముఖ్యమంత్రి కేసీఆర్ హజరుకానున్నారని మంత్రి వెల్లడించారు. శ్రీ రామ నవమి ఏర్పాట్లతో పాటు భద్రాద్రిని శాశ్వత ప్రతిపాదికన అభివృద్ది చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు సిధ్దం చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.గాలి గోపుర నిర్మాణం, మాఢ వీధులు అభివృద్ది, కళ్యాణ మంటపం ,రెండవ ప్రాకారం నిర్మాణం,పర్ణశాల అభివృద్దిపై సమగ్ర ప్రణాళికలను సిధ్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. వారం రోజుల్లో ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులకు సూచించామని ..ప్రతిపాదనలు అందిన వెంటనే వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంచనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు:
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా భద్రాద్రి ఆలయాన్ని అభివృద్ది చేసేందుకు ప్రణాళికను సిధ్దం చేస్తున్నట్లు రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రచల శ్రీ సీతారామ స్వామి వారి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేసే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని తుమ్మల చెప్పారు.దీనిపై ఆగమ శాస్త్ర , వేధ పండితులు,స్తపతి సలహాలు తీసుకోనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ..భద్రచలం ఆయల మినహా మిగితా ప్రాంతాలు ఆంధ్ర ప్రాంతంలో కలిపి వేశారని..తిరిగి వాటిని తెలంగాణలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అటు ఆంధ్ర సీయం ఇటు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారన్నారు. ఆలయాభివృద్ది తోపాటు భద్రచలం పట్టణాన్ని కూడా అభివృద్ది చేయనున్నట్లు మంత్రి చెప్పారు. రహదారుల నిర్మాణం,రైల్వే లైను, సమాచార వ్యవస్థను ఇలా అన్ని రకాలుగా భద్రాద్రిని అభివృద్ది చేసేందుకు ప్రణాళిను సిధ్దం చేస్తున్నామన్నారు. ఈ నెల 15న జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి అందరూ అహ్వానితులే అని మంత్రి తుమ్మల అహ్వానం పలికారు.
No comments :
Write comments