28.4.16

Rai movie first look on 1st May


The first look of Ram Gopal Varma's most ambitious film "RAI"---The Greatest Gangster Ever,Starring Vivek Oberoi and produced by C R Manohar(MLC) is scheduled to be unveiled by Muthappa Rai during his birthday on May 1st at 6 pm in the presence of fifty thousand people at Bidadi, Bangalore

The film, to be shot in London, Dubai, Mumbai and Bangalore is going to be made at a cost of Rs 55 Cr.
The Hindi version of Rai has been acquired by one of the biggest producers of Bollywood, Raju Chadda of Wave films and Sunil Lulla of Eros International. The Telugu version of the film has been acquired by Dasari Kiran Kumar who is already producing the highly prestigious "Vangaveeti" with RGV and the Tamil version has been acquired by Mr.Ganga Raju,the South India film chamber President

Many celebrities and political leaders are attending the event at Bidadi on May 1st where there will be giant cutouts of the first look along with a gigantic firework display and a laser beam show of Rai's first look performed by Internationally acclaimed technicians



మే 1న విడుదల కానున్న రాంగోపాల్ వర్మ 'రాయ్' ఫస్ట్ లుక్
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సి.ఆర్.మనోహర్(ఎం.ఎల్.సి) నిర్మాతగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'రాయ్'. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మే 1వ తేది సాయంత్రం ముత్తప్ప రాయ్ పుట్టినరోజు సందర్భంగా యాబై వేల మంది ప్రజల మధ్యలో విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బెంగుళూరులోని బిదాడి వేదిక అవుతుంది.
55 కోట్ల భారీ బడ్జెట్ తో లండన్, దుబాయ్, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించనున్నారు. సత్య, కంపెనీ వంటి విజయవంతమైన గ్యాంగ్ స్టర్స్ చిత్రాలను తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  ఫ్యాన్సీ చెల్లించి ఈ సినిమా హక్కులను పొందారు. ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను వేవ్ ఫిలింస్ అధినేత రాజు చద్దా, ఈరోజ్ ఇంటర్రేషనల్ సునీల్ లుల్లా కైవసం చేసుకున్నారు. అలాగే తమిళ హక్కులను సౌతిండియా ఫిలించాంబర్ అధ్యక్షుడు గంగరాజు సొంతం చేసుకున్నారు.
జీనియస్, రామ్ లీలా వంటి చిత్రాలను నిర్మించిన అన్ కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ ప్రస్తుతం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వంగవీటి సినిమాను నిర్మిస్తున్నారు. ఈయన రాయ్ తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.
పలువురు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఆధ్వర్యంలో లేజర్ కిరణాలతో రాయ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నారు. మే 1న విడుదల కానున్న ఈ ఫస్ట్ లుక్ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు హాజరవుతున్నారు. 

No comments :
Write comments