9.6.16

Rashmi Goutham acting Antham Movie trailer launched

గుంటూరు టాకీస్ లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంతో యువ‌త హ్రుద‌యాల్లో ప‌ర్మినెంట్ ప్లేస్ ని సొంతం చేసుకున్న  ర‌ష్మిగౌతమ్ హీరోయిన్ గా ప్ర‌దాన‌పాత్ర‌లో న‌టించిన చిత్రం అంతం. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ చాలా పెర్‌ఫెక్ట్ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించిన చిత్రం అంతం. ఈ చిత్రం యెక్క మెద‌టి లుక్ ని ఇటీవ‌లే విడుద‌ల చేసిన త‌ర్వాత ట్రేడ్ లో విప‌రీత‌మైన క్రేజ్ రావ‌టం, మెత్తం రెండు రాష్ట్రాల‌కి ఫ్యాన్సి రేట్ కి శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్ అధినేత బాపిరాజు గారు రైట్స్ తీసుకున్నారు.  రష్మీ అందచందాలతో పాటు పెర్ పార్మెన్స్ కు స్కోప్ ఉన్న అద్బుత‌మైన పాత్ర‌లో నటించింది. ఎప్ప‌టిక‌ప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ త‌న కెరీర్ ని అందంగా మ‌లుచుకునే రష్మీ  గౌతమ్ కి ఈ చిత్రం చాలా మంచి పేరు తెచ్చిపెడుతుంది.  అంతం చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని ఎ సర్టిఫికెట్ పొందింది.  కార్తిక్ సంగీతమందించాడు.చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పై వ‌స్తున్న ఈ చిత్రం జూన్ చివ‌రి వారంలో విడుద‌ల కానుంది. 

ఈ సందర్బంగా దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ మాట్లాడుతూ.... మా అంతం చిత్రం ఇప్పటివరకు రాని అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ అని గర్వంగా చెప్పగలను. గుంటూరు టాకీస్ చిత్రంలో చాలా మంచి ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చిన  రష్మీ గౌతమ్ మా చిత్రంలో  గ్లామర్ తో పాటు టెర్రిఫిక్ పెర్ పార్మెన్స్ ఇచ్చింది. అప్పుడే పెళ్ళి చేసుకున్న అంద‌మైన జంట జీవితంలోకి అనుకోని సంఘ‌ట‌న‌లు ఎదురై వారి జీవితాన్ని తుంచేస్తున్న స‌మ‌యంలో ఆ జంట ఏం చేశారు.. అనేది ఈ చిత్ర ముఖ్య‌క‌థాంశం. ఈ చిత్రం చూసిన త‌రువాత హీరోయిన్ ర‌ష్మి ఫెర్‌ఫార్మెన్స్ గురించి మాట్లాడుతారు. గుంటూరు టాకీస్ చిత్రం త‌రువాత ర‌ష్మి న‌టించిన చిత్రం కావ‌టం తో ప్రేక్ష‌కుల్లో విప‌రీత‌మైన క్రేజ్ వుంది. వారి అంచ‌నాలు త‌ప్ప‌కుండాఅందుకుంటాము.  ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్ అధినేత బాపిరాజు గారు ఫ్యాన్సీ రేట్ కి చిత్రాన్ని కొనుగొలు చేయ‌టం మాకు చాలా ఆనందంగా వుంది. వారికి మా ప్ర‌త్యేఖ‌మైన ధ‌న్య‌వాదాలు. ఇప్ప‌డు ట్రైల‌ర్ ని కూడా విడుద‌ల చేశాము. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని ఏ సర్టిఫికెట్ పొందిన మా అంతం చిత్రాన్ని జూన్ చివ‌రి వారంలో విడ‌దల చేయ‌నున్నాము. అని అన్నారు. 

నటీనటులు
రష్మీ గౌతమ్, చరణ్ దీప్, వాసుదేవ్, సుదర్శన్

సాంకేతిక వర్గం
ప్రొడక్షన్ బ్యానర్ - చరణ్ క్రియేషన్స్
సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, డిఐ - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
మ్యూజిక్ - కార్తిక్ రోడ్రిగ్జ్
స్టంట్స్ - రామ్ సుంకర
సౌండ్ ఎఫెక్ట్స్ - ఎతిరాజ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.లక్ష్మీపతి రావ్, బి.వేణు
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్

No comments :
Write comments