పూజిత, ధీరేంద్ర జంటగా షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ నిర్మించనున్న చిత్రం 'డర్టీగేమ్'. ఈ చిత్రం గురుపౌర్ణమిని పురస్కరించుకుని సీనియర్ నటుడు సురేష్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాత తాడి మనోహర్ కుమార్ మాట్లాడుతూ..గురుపౌర్ణమిని పురస్కరించుకుని మా చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. సీనియర్ నటుడు సురేష్ ఇందులో ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారు. ఆగస్ట్ 4 నుండి షూటింగ్ మొదలవుతుంది. సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చిత్రాన్ని చిత్రీకరణ జరుపనున్నాం..అని అన్నారు.
చిత్ర దర్శకుడు అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ..రాజకీయ నేపథ్యంతో సాగే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఏది డర్టీగేమ్? ఆ గేమ్‌ని ఆడింది ఎవరు? దాని రిజల్ట్ ఏమిటి? ఆ గేమ్‌లో గెలిచింది ఎవరు? ఓడిపోయింది ఎవరు? ఈ మిస్టరీని చేధించింది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికి జవాబు తెలియాలంటే..సస్పెన్స్, రొమాన్స్, కామెడీ మరియు ఎమోషన్స్ సమపాళ్ళలో రంగరించిన ఈ రియలిస్టిక్ చిత్రాన్ని తెరపైన చూడాల్సిందే. ప్రముఖ నటుడు సురేష్‌తో పాటు నిర్మాత తాడి మనోహర్ కుమార్ కూడా ఇందులో ఓ కీలకపాత్రను చేస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము...అని అన్నారు.
పూజిత, ధీరేంద్ర, సురేష్, అస్మిత, రమ్య, తాడి మనోహర్ నాయుడు, జబర్ధస్త్ టీమ్ మొదలగువారు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కథ-మాటలు-పాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ.

No comments :
Write comments