హైదరాబాద్ :కృష్ణ పుష్కరాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రూపోందించిన ప్రత్యేక వైబ్ సైట్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయంలో లాంచ్ చేశారు. http://pushkaralu.telangana.go
రోజు వారీగా భక్తుల సంఖ్యను వెబ్ సైట్ లో అధికారులు ఎప్పటిక్పుడు ఆప్ డేట్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్ , ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ , ఐటి డిపార్టుమెంటు డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పాల్గోన్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలంపూర్ సమీపంలోని గుందిమల్ల పుష్కర్ ఘాట్ వద్ద పుణ్య స్నానమాచరించనున్నారని తెలిపారు. రేపు సాయంత్రం (11న) అంలపూర్ వెళ్లి అక్కడ బస చేస్తారని చెప్పారు. పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సూర్యోదయాన ఉదయం 5.58 నిమిషాల నుంచి 6.30గంటల మధ్య ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా పుణ్య స్నానమచరించనున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. పుష్కరాలకు హజరుకావాలని వివిధ పీఠాధీపతులను రాష్ట్ర ప్రభుత్వం అహ్వనించిందన్నారు. ఆలంపూర్ కు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి మఠానికి చెందిన దేవాతం జీయర్, జగన్నాథ స్వామి మఠానికి చెందిన వ్రతాధర స్వామి,శ్రీ శ్రీ కమలానంద భారతి , బర్ధీపూర్ మహారాజ్ లు ఆలంపూర్ లో ప్రత్యే పూజలు చేస్తారని మంత్రి వివరించారు. భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేశామని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కృష్ణ నది లోతు ఎక్కువగా ఉన్నందును భక్తుల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పుష్కర ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను సిధ్దంగా ఉంచామన్నారు. మొసళ్లు పుష్కర ఘాట్ల వద్దకు రాకుండా ప్రత్యేకంగా ఇనుప కంచెను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
హెల్ప్ లైన్ సెంటర్లు
పుష్కర యాత్రికుల కోసం హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. పుష్కర ఘాట్లకు వెళ్లే రూట్లు, వివిధ ప్రాంతాల నుంచి ఎలా రావాలి, రైళ్లు, బస్సు సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్‌కు చాలా మంది భక్తులు ఫోన్ లు చేసే అవకాశం ఉంది. క్యూలైన్లలో ఇబ్బందులు, ఘాట్లలో సమస్యల గురించి కాల్స్ చేయవచ్చు.హెల్ప్‌లైన్ కు వచ్చే ఫిర్యాదులు, సమస్యలపై ఆయా శాఖలకు సమాచారం ఇవ్వనున్నారు. హెల్ప్‌లైన్ సెంటర్ పుష్కర ఘాట్‌ల కంట్రోల్ రూముల నుంచి తప్పిపోయిన వారి వివరాలను కూడా అనౌన్స్ చేస్తారు. కంట్రోల్ రూంలు, హెల్ఫ్ లైన్ సెంటర్ లను ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ నంబర్లు : 040-24755522, 040-24750102, 7794014301, 7794014302.
No comments :
Write comments