పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా చేసే నటుల్లో చాలా అరుదుగా మనకు కనపడతారు. అటువంటి హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకరు. ఏ పాత్ర చేసినా అందలో జీవించే ప్రయత్నం చేస్తుంటారాయన. విలక్షణతకు పట్టం కట్టే తెలుగు ప్రేక్షకులు అందుకే చియాన్ విక్రమ్ అంటే అభిమానాన్ని ఏర్పరుచుకున్నారు. శ్మశానంలో ఉండి మాటలు రాని శివపుత్రుడుగా ఉత్తమ అభినయాన్ని కనపరిచి జాతీయ అవార్డును దక్కించుకున్న విక్రమ్ అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. కూతురుపై ప్రేమను అద్భుతంగా వ్యక్తం చేసే నాన్నగా, గ్రుడ్డివాడు విక్రమ్ చేసిన శివతాండవంను ప్రేక్షకులు మరచిపోలేరు. అలాగే స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిగా, అన్యాయాన్ని ఎదిరించిన అపరిచితుడుగా మెప్పించారు. ఐ చిత్రంలో కురూపిగా విక్రమ్ నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఇలాంటి విలక్షణ నటుడు విక్రమ్ మన ముందుకు `ఇంకొక్కడు`గా రానున్నారు. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రంలో రా ఏజెంట్ గానే కాకుండా, లవ్ అనే హిజ్రా పాత్రలో విక్రమ్ నటన ప్రేక్షకులకు కనువిందు చేయడం గ్యారంటీ. విక్రమ్ నటనతో పాటు హ్యరీష్ జైరాజ్ అందించిన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
ఓ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన `ఇంకొక్కడు` చిత్రంలో నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమిళంలో ఇరుముగన్ అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ అధినేత నీలం కృష్ణారెడ్డి `ఇంకొక్కడు`గా సెప్టెంబర్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
-Press note
No comments :
Write comments