తితిదే ట్రస్టులు, స్కీమ్‌కు గాను భక్తులు తిరుమలలోని అన్ని బ్యాంకుల్లో విరాళాలు సమర్పించే సౌలభ్యం కల్పించాలని తితిదే ఈవో డా|| డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నవంబరులో జరుగనున్న మనగుడి కార్యక్రమంలో స్థానిక భజనమండళ్ల సభ్యులు, శ్రీవారి సేవకులను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని కోరారు. తిరుపతిలోని తితిదేకి చెందిన తొమ్మిది రోడ్ల సుందరీకరణ చేపట్టాలని, ఇందులో భాగంగా పచ్చదనం పెంపు, తాగునీటి వసతి, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని సూచించారు. స్థానికాలయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినపుడు ప్రత్యామ్నాయంగా ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహా
లో తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆధునిక శుద్ధి యంత్రాలను వినియోగించాలన్నారు.
లో తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆధునిక శుద్ధి యంత్రాలను వినియోగించాలన్నారు.
తితిదే డైరీలు, క్యాలెండర్లకు ఎస్వీబీసీ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని, తితిదే సమాచార కేంద్రాలతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని ఈవో ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పాదరక్షల కౌంటర్లు ఏర్పాటుచేయాలని సూచించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. శ్రీగోవిందరాజస్వామివారి సత్రాల ప్రాంగణంలో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
నవంబరు 2 నుంచి ఎస్వీబీసీ తమిళ ఛానల్ టెస్ట్ సిగ్నల్ :
నవంబరు 2వ తేదీ నుంచి ఎస్వీబీసీ తమిళ ఛానల్ టెస్ట్ సిగ్నల్ ప్రసారం చేయాలని సిఈవో శ్రీ ఎవి.నరసింహారావును ఈవో ఆదేశించారు.
ఈ సమావేశంలో తితిదే తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీఎన్.ముక్తేశ్వరరావు, న్యాయాధికారి శ్రీ వెంకటరమణ, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ బాలాజి ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments