ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్'. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేయడానికి నిర్మాత కె.అశోక్‌కుమార్ ప్లాన్ చేస్తున్నారు.
ఏప్రిల్ 27న 'జయదేవ్' టీజర్
నిర్మాత కె.అశోక్‌కుమార్ మాట్లాడుతూ - ''జయంత్ దర్శకత్వంలో ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్ తర్వాత మూడో చిత్రంగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుగారి తనయుడు గంటా రవి హీరోగా పరిచయం చేస్తూ పవర్‌ఫుల్, పర్పస్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'జయదేవ్' చిత్రాన్ని నిర్మిస్తున్నాము. వివిధ లొకేషన్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ భారీ లెవ్‌ల్‌లో చేశాం. ఏప్రిల్ 27 సాయంత్రం గం 4.25లకు 'జయదేవ్' టీజర్‌ను విడుదల చేస్తున్నాం. అలాగే ఏప్రిల్ 30న ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నాం. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు స్లొవేనియాలో రెండు పాటల్ని చిత్రీకరించడం జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది. మే చివరి వారంలో చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
దర్శకుడు జయంత్ సి.పరాన్జీ మాట్లాడుతూ - ''అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఈచిత్రంలో వున్నాయి. ఇది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ. విధి నిర్వహణ కోసం తమ కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసే ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ల ఇన్‌స్పిరేషన్‌తో 'జయదేవ్' క్యారెక్టర్‌ని డిజైన్ చెయ్యడం జరిగింది. ఈ చిత్రంలో ఆడియన్స్‌ని థ్రిల్ చేసే పది భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వున్నాయి. కథతో లింక్ అయి వున్న ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ అవుతాయి. అశోక్‌కుమార్‌గారి బేనర్‌లో 'ఈశ్వర్'తో ప్రభాస్‌ని హీరోగా పరిచయం చేశాం. మళ్ళీ ఇదే బేనర్‌లో 'జయదేవ్' చిత్రంతో గంటా రవిని హీరోగా నా దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ చేయడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.
గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్, హరితేజ, శ్రావణ్, సుప్రీత్, కోమటి జయరామ్, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్, అరవింద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి, మూల కథ: అరుణ్‌కుమార్, రచన: పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఫైట్స్: వెంకట్, ఆర్ట్: కృష్ణమాయ, స్టిల్స్ నారాయణ, కో-డైరెక్టర్: ప్రభాకర్ నాగ్, ప్రొడక్షన్ కంట్రోలర్: పి.రామమోహన్‌రావు, నిర్మాత: కె.అశోక్‌కుమార్, దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ.
No comments :
Write comments