పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు దర్శకులు కె విశ్వనాధ్ ఇంటికి వెళ్లి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు అభినందించారు, శంకరాభరణం, శుభలేఖ, స్వాతిముత్యం, సప్తపది వంటి విశ్వనాథ్ సినిమాలు తనకి చాలా ఇష్టమైన చిత్రాలు అని, స్వయంకృషి షూటింగ్ జరుగుతున్న సందర్భంలో తరచూ విశ్వనాధ్ గారి దర్శకత్వాన్ని గమనించడానికి లొకేషన్ కి వెళ్ళేవాడినని, శాస్త్రీయ సంగీతం పై అవగాహన విశ్వనాథ్ చిత్రాలు చూసిన తరువాతే ఏర్పడిందని పవన్ కళ్యాణ్ అన్నారు. విశ్వనాధ్ దర్శకత్వం వహించిన 12 చిత్రాల తో ఓ డిస్క్ చేసి విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నామని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు.
No comments :
Write comments