తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా పదకొండు రోజుల పాటు జరిగిన శ్రీ కపిలేశ్వస్వామివారి హోమం గురువారం ఘనంగా ముగిసింది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు రుద్రయాగ సమాప్తి, మహాపూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, కలశ ఉద్వాసన, కలశాభిషేకం, హారతి నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు మాసశివరాత్రి సందర్భముగా శివపార్వతుల దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా జరుగనుంది. అనంతరం శ్రీ కాలభైరవస్వామివారి కలశస్థాపన, కలశ ఆరాధన, హోమం, నివేదన, హారతి నిర్వహిస్తారు.
నవంబరు 17వ తేదీ శుక్రవారం శ్రీ కాలభైరవస్వామివారి హోమం జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీసుబ్రమణ్యం, ఏఈవో శ్రీశంకర్‌రాజు, ఆలయ అర్చకులు శ్రీ
మణిస్వామి, శ్రీస్వామినాథస్వామి, శ్రీవిజయ స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments