Supreme Court Chief Justice of India Sri NV Ramana Arrival at Shamshabad Airport
శుక్రవారం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గారికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నగరమేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పార్లమెంట్ సభ్యులు కె.కేశవ రావు, సురేష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి ఎం మహేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్సీలు, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకెపూడి గాంధీ, రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, కల్వకుర్తి శాసనసభ్యులు జయ్ పాల్ యాదవ్, షాద్ నగర్ శాసనసభ్యులు అంజయ్య యాదవ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ , సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
No comments :
Write comments