12.10.24

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తి భావాన్ని పంచిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు









 తిరుమల, 2024 అక్టోబ‌రు 11 ; శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం తిరుమలలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తి భావాన్ని పంచాయి.

నాదనీరాజనం వేదికపై ఉదయం 4:30 నుండి 5:30 గంటల వరకు శ్రీ వేణుగోపాల్ బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన ఆచార్య రంగ రామానుజాచార్యులు ' వేదం- పురుషోర్ధాలు' అనే అంశంపై ఉపన్యసించారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన శ్రీ మోహన్ కృష్ణ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. 

ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి కామాక్షి బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి శైలజ బృందం భక్తి సంగీతం నిర్వహించారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఢిల్లీ కుమార్, శ్రీమతి మంజుల బృందం అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ శ్రీనివాస రావు బృందం హరికథ గానం చేశారు.

No comments :
Write comments