రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడుకు ఆదివారం టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామలరావు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శ్రీ విశ్వా వసునామ తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా మర్యాద పూర్వకంగా చైర్మన్, ఈవో కలిశారు.
ఈ సందర్భంగా గౌ|| ముఖ్యమంత్రివర్యులకు శేషవస్త్రం, శ్రీవారి తీర్థప్రసాదాలను చైర్మన్, ఈవో కలిసి అందించారు. వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి రండి
• ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వాన పత్రిక అందించిన టీటీడీ చైర్మన్, ఈవో
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవానికి విచ్చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ జె. శ్యామలరావు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రిని కలిశారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు.
No comments :
Write comments