తిరుపతి శ్రీ కోదండ రామస్వామివారికి రూ.4.10 లక్షల విలువైన బంగారు పూత వేసిన రాగి ఆభరణాలను బుధవారం చెన్నైకి చెందిన శ్రీ శ్రీధర్ మరియు వారి కుటుంబ సభ్యులు కానుకగా సమర్పించారు. ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నకు వీటిని అందించారు.
బహుకరించిన వాటిలో ఉత్సవమూర్తులకు అలంకరించే ఆరు హస్త కవచాలు, ఆరు పాద కవచాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
No comments :
Write comments