తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు గురువారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు.
గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శేష వాహపంపై స్వామివారిని దర్శించే భక్తుల్ని కాపాడుతానని, భక్తులు శేషుని వలే తనకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments