శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనం వేదికపై కవి సమ్మేళనం కార్యక్రమం వైభవంగా జరిగింది.
టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ ఆధ్వర్యంలో షడ్రుచుల సమ్మేళనం, సప్త పర్వత సమ్మేళనంగా ఈ కార్యక్రమం సాగింది. కవులు, అవధానులైన శ్రీ సురభి శంకర శర్మ, శ్రీ అన్నాపంతుల జగన్నాథరావు, డాక్టర్ శ్రీ మైలవరపు మురళీకృష్ణ, శ్రీ ఎస్.సాయిప్రసాద్, శ్రీ పొన్నెగంటి సూర్య నారాయణ, కుమారి సురభి బాల రాఘవ సుహార్షిణి, శ్రీ చింతా రామకృష్ణ రావు తెలుగు భాష వైభవం, మన సంస్కృతి, సాంప్రదాయాలు, టీటీడీ భక్తులకు చేస్తున్న సేవలపై పద్యాల రూపంలో వివరించారు.
No comments :
Write comments