హిందూ ధర్మం ఛానెల్ రూపొందించిన శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తిరుమలలోని శ్రీ పెద్ద జీయర్ మఠంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామితో కలిసి ఆవిష్కరించారు.
పంచాంగంలోని విశేషాలను చైర్మన్ పెద్ద జీయర్ స్వామికి వివరించారు. ఈ సందర్భంగా మఠంలోని మందిరంలో పంచాంగాలకు పూజలు నిర్వహించి చైర్మన్ ను పెద్ద జీయర్ స్వామి పట్టు వస్త్రంతో సత్కరించి ఆశీర్వాదం అందజేశారు.
No comments :
Write comments