తిరుమల, తిరుపతి స్థానికుల కోటా దర్శనంలో భాగంగా ఏప్రిల్ 06వ తేది ఆదివారం నాడు స్థానికులకు దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.
ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.
ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
No comments :
Write comments