19.4.25

19న తిరుమలలో 'స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం




రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారమైన ఏప్రిల్ 19న తిరుమలలో సామూహిక శ్రమదానాన్ని టీటీడీ నిర్వహించనుంది.

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రం చేయనున్నారు.
అలిపిరి నడక దారిలోని కుంకాల పాయింట్ (ఆఖరి మెట్టు) వద్ద నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

No comments :
Write comments