భారతజాతి గర్వించదగ్గ జాతీయ నాయకులు, రాజనీతిజ్ఞులు, దళితుల జీవితాల్లో వెలుగురేఖలు నింపిన మహనీయుల జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 5, 11, 14వ తేదీలలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది.
ఇందులో భాగంగా ఏప్రిల్ 5న డా. బాబు జగ్జీవన్‌రామ్, ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిబా ఫూలే, ఏప్రిల్ 14వ తేదీన డా.బీ.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.
మహతి ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు జయంతి సభ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు జాతీయ నాయకుల జీవిత విశేషాలు, వారు సమాజానికి చేసిన సేవలపై ప్రసంగిస్తారు.
No comments :
Write comments