28.4.25

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం


చెన్నై కు చెందిన పొన్ ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆదివారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించింది.

ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ సీఎండీ శ్రీ ఎం.పొన్నుస్వామి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఎం.పి.సూర్యప్రకాశ్ విరాళం చెక్కును అందజేశారు. ఈ విరాళాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టులో భాగమైన శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ పథకానికి వినియోగించాలని దాత అదనపు ఈవో ను కోరారు.

No comments:

Post a Comment