ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కల్యాణంలో దాదాపు 70 వేల మంది భక్తులు పాల్గొని వీక్షించారు. టీటీడీలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు చేసిన ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.
ఏర్పాట్ల వివరాలు:
- కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద విశాలవంతమైన 147 గ్యాలరీలు ఏర్పాటు చేసి, భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించారు.
• కళ్యాణోత్సవానికి విచ్చేసిన ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణాలు టీటీడీ అందించింది.
- అదేవిధంగా ప్రతి భక్తుడికి లెమన్ రైస్, చక్కర పొంగలి, బిస్కెట్ ప్యాకెట్, మ్యాంగో జ్యూస్, వాటర్ బాటిల్, కారాసు కిట్ రూపంలో అందించారు.
- శ్రీవారి సేవకులతో గ్యాలరీలలోని భక్తులకు నిరంతరం మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు పంపిణీ.
- నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో, ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు ప్రత్యేకంగా షెడ్లు, పానకం, మజ్జిగ, చలివేంద్రం, వాటర్ కూలర్లు, సిబ్బంది ఏర్పాటు.
.- శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు 23 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు.
- భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కల్యాణ వేదిక వరకు టీటీడీ 20 ఉచిత బస్సులు ఏర్పాటు
- 13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్స్ లతో వేలాది మందిని పరిక్షించి అవసరమైన మందులు పంపిణీ.
- 250 మరుగుదొడ్లు, 3,268 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించారు.
- 2500 మంది శ్రీవారి సేవకులు, ప్రభుత్వ, పోలీస్, టీటీడీ సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించారు.
- శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని ఎస్వీబీసీ హెచ్‌డి క్యాలిటీతో అందించిన ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచ వ్యాప్తంగా లక్షలాధి మంది భక్తులు వీక్షించారు.
No comments :
Write comments