29.4.25

మే 8 నుండి 16వ తేదీ వ‌ర‌కు బూర‌గ‌మంద శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు




చిత్తూరు జిల్లా స‌దుం మండ‌లం బూర‌గ‌మంద గ్రామంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మే 8 నుండి 16వ తేదీ వరకు వైభ‌వంగా జరుగనున్నాయి. మే 7న సాయంత్రం అంకురార్పణం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 17వ తేదీన సాయంత్రం 5 గంట‌లకు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
08-05-2025 - సాయంత్రం - ధ్వజారోహణం
09-05-2025 - సాయంత్రం - శేష వాహనం
10-05-2025 - సాయంత్రం - హంస వాహనం
11-05-2025 - సాయంత్రం - హనుమంత వాహనం
12-05-2025 - సాయంత్రం - కల్యాణోత్సవం, గరుడ వాహనం
13-05-2025 - సాయంత్రం - పుష్ప పల్లకి
14-05-2025 - సాయంత్రం - సింహ వాహనం
15-05-2025 - సాయంత్రం - అశ్వవాహనం
16-05-2025 - ఉదయం - చక్రస్నానం, సాయంత్రం - గజ వాహనం, ధ్వజావరోహణం
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

No comments :
Write comments