ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి కల్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు వెల్లడించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులు, శ్రీవారి సేవకులతో గురువారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, గ్యాలరీలలో ఉండే భక్తులకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసిన స
కల్యాణ తలంబ్రాలు, స్వామి వారి ప్రసాదం, అన్నప్రసాదాలను క్రమపద్ధతిలో అందించాలని సూచించారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వాహనాల పార్కింగ్, గ్యాలరీలోకి భక్తుల ప్రవేశం, నిష్క్రమణలో క్రమపద్ధతి పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

టిటిడి ఆధ్వర్యంలో జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వామి వారికి గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.
స్వామి వారి మీద భక్తితో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులను ఈవో అభినందించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులతో సంయమనంతో ఉండాలని పోలీసులను కోరారు. గ్యాలరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో టిటిడి జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, సివిఏస్వో శ్రీ హర్షవర్ధన్ రాజు, ఇతర శాఖల టిటిడి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments