8.4.25

ఘనంగా ముత్యాల తలంబ్రాల ఊరేగింపు






తిరుపతి శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది.


ముందుగా టీటీడీ పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో అధికారులు ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ముత్యాలను అంబారీలపై ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ కోదండ రామాలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులకు అందించారు. ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, శ్రీగోవిందరాజస్వామి ఆలయ దక్షిణ మాడ వీధి, బజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది. 

సోమవారం సాయంత్రం జరిగే శ్రీ సీతారాముల కల్యాణంలో ఈ ముత్యాల తలంబ్రాలను వినియోగిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments