4.4.25

ఎస్వి హై స్కూల్ లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు - అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి







తిరుమల ఎస్వి హై స్కూల్ లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్నట్లు అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు.

శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం తిరుమలలో టిటిడి అదనపు ఈఓ శ్రీ సిహెచ్.వెంకయ్య చౌదరి విద్యార్థులు మరియు అధ్యాపకులతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు ఈవో మాట్లాడుతూ, చాలా కాలం తర్వాత ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇది తన పాఠశాల మరియు కళాశాల రోజులను గుర్తుకు తెచ్చిందని ఆయన అన్నారు.
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుందన్నారు. దేశానికి మంచి పౌరులను అందించడానికి చదువుతో పాటు, ఉన్నత విలువలను బోధించాలని అధ్యాపకులకు సూచించారు. శ్రీవారి పాదాల చెంత టీటీడీ పాఠశాలలో చదువుకుంటున్న మీరందరూ ఎంతో అదృష్టవంతులు అని ఆయన చెప్పారు.
పాఠశాల ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని విద్యార్థులు తమలో నైపుణ్యం వెలికి తీసే వివిధ కళల్లో, క్రీడల కొరకు వినియోగించుకోవాలని ఆయన చెప్పారు.
తరువాత అదనపు ఈఓ వివిధ పోటీ పరీక్షలు మరియు క్రీడలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు పతకాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి శ్రీమతి విజయలక్ష్మి, అకడమిక్ ఇన్‌చార్జ్ శ్రీమతి రంగలక్ష్మి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ సురేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

No comments :
Write comments