6.4.25

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్న గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి




తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శనివారం సాయంత్రం దర్శించుకున్నారు.

శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారికి టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం సీజేఐ వారికి టిటిడి ఈవో తీర్థప్రసాదాలను అందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తిరుమల చేరిన గౌరవ సీజేఐ
శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానంతరం తిరుమల చేరుకున్న సీజేఐ గారికి శ్రీ పద్మావతీ అతిథి గృహం వద్ద టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. 
గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

No comments :
Write comments