అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభం సంప్రోక్షణ కార్యక్రమాలు బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా బుధవారం ఉదయం 8 నుండి 11.15 గంటల వరకు యాగశాలలో వాస్తుహోమం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు కళాపకర్షణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఆలయ అర్చకులు శ్రీ సూర్యకుమారాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
ఏప్రిల్ 3న ఉదయం 8.15 నుండి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు జీవ ధ్వజస్తంభ మహా శాంతి అభిషేకం, పూర్ణాహూతి జరుగనుంది. ఏప్రిల్ 4న ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు మహా పూర్ణాహూతి, కుంభ ప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ దేవరాజు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
No comments :
Write comments