12.4.25

సీతారాములకు శ్రీవారి కానుక •⁠ ⁠సీతమ్మకు స్వ‌ర్ణ కిరీటం, రామయ్యకు య‌జ్ఞోప‌వీతం బహూకరణ















ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కల్యాణం సందర్బంగా తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామివారు శుక్ర‌వారం కానుకలు పంపారు .

కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం రాత్రి కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ శుభ సందర్బంగా స్వ‌ర్ణ‌ కిరీటం, య‌జ్ఞోప‌వీతం ఆభరణాలను కానుకగా అందించారు.
టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి కానుకలు పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే శుక్ర‌వారం ఈ ఆభరణాలు సమర్పించారు.
ఆలయం ముందు టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీ.ఆర్ నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు ఆభరణాలకు పూజలు చేసి కోదండరామునికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీవీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేశ్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments