చంద్రగిరి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 8 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల రామనామస్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కంకణభట్టార్ శ్రీ శ్రీనివాసభట్టార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు , పలువురు అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments