5.4.25

పూర్ణాహూతితో ముగిసిన‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌య ధ్వజస్తంభం సంప్రోక్ష‌ణ





అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో శుక్ర‌వారం ధ్వజస్తంభం సంప్రోక్ష‌ణ పూర్ణాహూతితో శాస్త్రోక్తంగా ముగిశాయి.

ఆలయ అర్చకులు శ్రీ సూర్యకుమారాచార్యులు ఆధ్వర్యంలో శుక్ర‌వారం ఉద‌యం 7.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఉద‌యం 9.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు మ‌హా పూర్ణాహూతి, కుంభ ప్రోక్ష‌ణ శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ఏఈవో శ్రీ దేవ‌రాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమ‌తి శ్రీ‌వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివ‌కుమార్‌, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments