Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

13.8.25

₹1.10 Cr Donation to TTD

Sri Kodali Srikanth, Founder and MD of Kapston Services, Hyderabad, donated Rs.1 Crore to the Sri Venkateswara Anna Prasadam Trust and Rs. 10 lakh to the Sri Venkateswara Gosamrakshana Trust...

Pavitrotsavams in Karvetinagaram on 19th and 20th August

The annual Pavithrotsavams will be conducted with grandeur at Sri Venugopalaswamy Temple in Karvetinagaram on August 19 and 20.Pavithrotsavams are performed annually. These rituals include the purification of the temple...

ఆగస్టు 19, 20వ తేదీల్లోకార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు karvetinagaram

కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 19, 20వ తేదీల్లో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఇందులో భాగంగా ఆగస్టు 19వ తేదీన ఉదయం ఆచార్య రుత్విక్‌వరణం, సాయంత్రం మృత్సంగ్రహణం, సేనాధిపతి తిరువీధి ఉత్సవం, పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 20వ తేదీన ఉదయం మూలవర్లకు తిరుమంజనం, పవిత్రాల సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ...

Devotees Donates Two Battery Buggies to TTD

A devotee from Bengaluru, Sri Chandra Shekhar, on Tuesday donated two battery buggies worth Rs. 11 lakh to TTD.Special pujas were performed for the vehicles in front of the Srivari...

టీటీడీకి రెండు బ్యాటరీ బగ్గీలు విరాళం battery Buggies

బెంగుళూరుకు చెందిన శ్రీ చంద్ర శేఖర్ అనే భక్తుడు మంగళవారం టీటీడీకి రూ.11 లక్షలు విలువైన రెండు బ్యాటరీ బగ్గీ వాహనాలను విరాళంగా అందించారు.ఈ మేరకు శ్రీవారి ఆలయం ముందు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు వాహన తాళాలు అందజేశారు. ...

TTD Addl Eo Reviews Museum Works

The Additional EO of TTD Sri Ch Venkaiah Chowdary on Tuesday evening reviewed the status of ongoing development works in the SV Museum.The meeting took place at Annamayya Bhavan in...

ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి ఈ నూతన విధానం ఆగస్టు 15 నుండి విధిగా అమలు fastag

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించే దృష్ట్యా ఆగస్టు 15వ తారీకు నుండి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి చేయడం జరిగింది.ఇకపై ఫాస్ట్ టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించడం జరగదు.ఫాస్ట్ టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో ఫాస్ట్ టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఫాస్ట్ టాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్ట్ టాగ్ సౌకర్యాన్ని పొందిన తరువాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని మరొకసారి తెలియజేయడమైనది.భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది. ...

Pavitrotsavams

The annual Pavitrotsavams in Sri Siddheswara Swamy temple in Annamaiah District from August 14-16.On August 14 Ankurarpana, Grandhi Pavitra Puja, August 15 Vighneshwara Puja, Yagashala Puja, Vaidikarchana, Pavitra Samarpana, Laghu...

ఆగష్టు 14 - 16 తేదీ వరకు తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు Sidheswara Swmay Vari Temple

అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయంలో ఆగష్టు 14 - 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగష్టు 14న పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, గ్రంధి పవిత్ర పూజ నిర్వహిస్తారు. ఆగష్టు 15న విఘ్నేశ్వరపూజ, యాగశాల పూజ, వేదికార్చన, పరివార దేవతలకు గ్రంధి పవిత్ర సమర్పణ, నివేదన, హారతి,   లఘు పూర్ణాహుతి చేపడతారు. ఆగష్టు 16న పవిత్ర సమర్పణ, నిత్య పూజ, వేదికార్చన, నిత్య హోమం, పట్టు పవిత్ర పూజ, మహా పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ...

Fastag Mandatory for Vehicles Entering Tirumala

In order to provide better safety standards, prevention of overcrowding and transparent services to the devotees arriving in various vehicles at the Alipiri check point, FASTag will be made mandatory...

టీటీడీకి రూ.1.10 కోట్లు విరాళం 1.10 cr donation to ttd

హైదరాబాద్ కు చెందిన కాప్స్టన్ సర్వీసెస్ సంస్థ అధినేత శ్రీ కొడాలి శ్రీకాంత్ మంగళవారం ఉదయం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి, శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు. ...

12.8.25

₹20 Lakhs Donation to TTD

Sri S.N.V.L. Narasimha Raju, President of Children’s Education Society, Bengaluru, donated Rs. 10 lakh to the TTD SV Annaprasadam Trust and Rs. 10 lakh to the SV Pranadana Trust on...

Gokulastami Asthanam on 16th August, Utlotsavam on 17th August

The auspicious Gokulastami Asthanam will be observed on August 16 while Utlotsavam on August 17 in Tirumala.The Asthanam will take place from 8 pm to 10 pm at Bangaru Vakili...

తిరుమలలో ఆగస్టు 16న గోకులాష్టమి ఆస్థానం, 17న ఉట్లోత్సవం UTLOTSAVAM

తిరుమ‌ల‌ శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు.ఆగస్టు 17న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఉట్లను కొడుతూ భక్తులకు ఆనందాన్ని పంచుతారు.ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 17న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ...

Gokulastami Celebrations in Local Temples on 16th Aug

TTD is making elaborate arrangements to celebrate Gokulashtami in the local temples on Saturday, August 16.Tiruchanur:At Sri Krishna Swamy Temple attached to Sri Padmavathi Ammavari Temple, on the occasion of...

ఆగష్టు 16న స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి gokulastami

టిటిడి స్థానిక ఆలయాల్లో ఆగష్టు 16వ తేదీన శనివారం గోకులాష్టమి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తిరుచానూరులో….తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం శ్రీ కృష్ణస్వామివారి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.అనంత‌రం రాత్రి 7 గంట‌లకు స్వామివారు పెద్దశేష వాహ‌నంపై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులకు దర్శనమిస్తారు.  త‌రువాత గోపూజ, గోకులాష్ట‌మి ఆస్థానం జ‌రుగనుంది.అదేవిధంగా ఆగష్టు 17న ఉట్లోత్స‌వంను పుర‌స్క‌రించుకొని స్వామి వారికి స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవను చేపడుతారు. సాయంత్రం  ఉట్లోత్స‌వం, ఆస్థానం నిర్వహిస్తారు.శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో …..తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో గోకులాష్టమి సందర్భంగా సాయంత్రం శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, పురాణ ప‌ఠ‌ణం, ఆస్థానం నిర్వహిస్తారు.నారాయణవనంలో….నారాయ‌ణ‌వ‌నం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం, శుద్ది నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ కృష్ణ స్వామివారికి గోకులాష్టమి ఆస్థానం, నివేదన నిర్వ‌హించారు.ఆగష్టు 17వ తేదీ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం, శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, సాయంత్రం గోపూజ, ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.కార్వేటినగరంలో…కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి, శ్రీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకం, తదుపరి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ఆస్థానం, నివేదన చేపడుతారు. ఆగష్టు 17వ తేదీన ఉట్లోత్సవం సందర్భంగా ఉదయం సుప్రభాతం, తోమల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఉత్సవర్లకు సమర్పణ, సాయంత్రం గోపూజ, ఉట్లోత్సవం , రాత్రి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  ...

₹10 Lakhs Donation to TTD

Sri Charan Tej, Owner of C.R. Associates from Kadapa district, donated Rs. 10,10,116 to the TTD-run SV Anna Prasadam Trust on Monday.The donor handed over the DD to the TTD...

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం donation

బెంగుళూరుకు చెందిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ ఎస్.ఎన్.వి.ఎల్. నరసింహ రాజు అనే భక్తుడు సోమవారం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.ఈ మేరకు దాత ప్రతినిధి శ్రీ మోహన్ కుమార్ రెడ్డి తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు. ...

11.8.25

Malayappa Visits Vaikhanasa Sannidhi

On the succeeding day of Sravana Pournami, Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi visited Sri Vikhanasa Maharshi Sannidhi located on North Mada street in Tirumala on  Sunday evening.Srivari...

శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి Malayappa

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఆదివారం ఉత్త‌ర మాడ వీధిలో గ‌ల శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు చేశారు. శ్రీ విఖ‌న‌స మ‌హ‌ర్షి జ‌యంతి శ్రావణ పౌర్ణమి నాడు జ‌రిగింది. ఆ మ‌రుస‌టి రోజు...